హిట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు.. ఎంతో తెలుసా?

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ మూవీ రిలీజ్‌కు ముందే మంచి అంచనాలను క్రియేట్ చేసింది.ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ఇక ఈ చిత్ర టీజర్, ప్రోమో వీడియాలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.ఇక ఈ సినిమాకు తొలిరోజు మంచి రివ్యూలతో పాటు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు ఎగబడ్డారు.

సస్పెన్స్ అంశాలు పుష్కలంగా ఉండటంత, ఆకట్టుకునే కథనం, అదిరిపోయే పర్ఫార్మెన్సులు ఈ సినిమాకు ప్రేక్షకులను రప్పించేలా చేశాయి.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది.తొలి మూడు రోజులు ముగిసే సరికి ఈ సినిమా ఏకంగా రూ.3.57 కోట్ల మేర వసూళ్లు సాధించింది.కాప్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సరసన రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది.నాని ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు.ఇక ఈ సినిమా తొలి మూడు రోజుల్లో కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాలు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 2.03 కోట్లు
సీడెడ్ – 29.5 లక్షలు
గుంటూరు – 26 లక్షలు
ఉత్తరాంధ్ర – 34.5 లక్షలు
ఈస్ట్ – 15 లక్షలు
వెస్ట్ – 15 లక్షలు
కృష్ణా – 24.5 లక్షలు
నెల్లూరు – 9.5 లక్షలు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు – 3.57 కోట్లు