రజినీకు కరోనా ఇలా ప్లస్ అయ్యిందా.?

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇన్ని రోజులు సినిమాల్లో కనిపించారు కానీ మొట్టమొదటి సారిగా ఒక టెలివిజన్ షోలో కనిపించి ఆశ్చర్య పరిచారు.ఆశ్చర్యం అని ఎందుకు చెప్తున్నాం అంటే ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ షో అయినటువంటి “మ్యాన్ వర్సెస్ వైల్డ్” అనే అద్భుతమైన షోలో కనిపించడం ఆశ్చర్యమే కదా అందులోను మన దేశం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత రజినితోనే వీరి నెక్స్ట్ ఎపిసోడ్ ప్లాన్ చెయ్యడం గమనార్హం.

అయితే వీరు మొదటి నుంచి కూడా ఈ ఎపిసోడ్ ను మార్చ్ 23నే టెలికాస్ట్ చేస్తామని చెప్తూ వస్తున్నారు. ఇంతకు మునుపు మోడీతో ప్లాన్ చేసిన ఎపిసోడ్ కు రికార్డు స్థాయి వ్యూవర్ షిప్ మరియు టెలివిజన్ ఇంప్రెషన్స్ వచ్చి పడ్డాయి.ఇప్పుడు రజినీతో ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్ కు దానిని మించే అవకాశాలు అప్పుడే ఉంటాయి అనుకున్నారు.

ఈ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేస్తామని చెప్పినప్పుడు ఇప్పుడు దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఎక్కడా లేదు. కానీ ఇపుడు బాగా ఉండడంతో ఒక్కసారిగా దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో అందరూ ఇంటి పట్టునే ఉన్నారు.దీనితో రజినీ బేర్ గ్రిల్స్ తో చేసిన సాహసాలను టీవీల్లో ఎక్కువగానే చూసినట్టు తెలుస్తుంది.మరి ఈ ఎపిసోడ్ కు ఏ స్థాయి రెస్పాన్స్ వచ్చింది అన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది.

error: Content is protected !!