ఆచార్య సినిమాకి కొరటాల శివ తీసుకొనే రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాలసిందే

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో కొరటాల శివ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. మిర్చి సినిమా నుండి కొరటాల శివ ప్రతి ఒక్క సినిమా నీ చాలా ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రతి సినిమా ఇప్పటివరకు సూపర్ హిట్ లేదంటే బ్లాక్ బస్టర్, అలాంటి కొరటాల శివ ప్రతి సినిమా కు మినిమం 15 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. అయితే చిరంజీవి ఆచార్య చిత్రానికి కొరటాల భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం ఈ ఒక్క చిత్రానికి కొరటాల శివ దాదాపు 25 కోట్ల రూపాయల్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం చిరు చిత్రం కోసం కొరటాల తన పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్నారు. కొరటాల శివ కి భరత్ అనే నేను చిత్రం తర్వత చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ కేవలం చిరు చిత్రం కోసం మాత్రమే పని చేస్తున్నారు.

అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో రాజమౌళి ఒక్కొక్క చిత్రాన్ని చాలా ఎక్కువ మొత్తం లో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి బాహుబలి చిత్రానికి మొదటగా 40 కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వత బాహుబలి సిరీస్ విజయాలతో అగ్ర దర్శకుడు గా మారిపోయారు. అయితే రాజమౌళి తన తదుపరి చిత్రాలకు 100 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజమౌళి అదే తరహాలో కలెక్షన్లు కూడా రాబట్టెలా తీయ గలరు. అయితే ఆ తరహాలో కొరటాల రెండవ స్థానం లో కొనసాగుతున్నారని చెప్పాలి.