నెటిజన్ల ని ఒక రేంజ్ లో ప్రభావితం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తాజాగా సోషల్ మీడియా ని ఉపయోగించడం మొదలు పెట్టారు. ఉగాది పండుగ రోజున సోషల్ మీడియా లోకి అడుగుపెట్టిన చిరు, తక్కువ సమయంలోనే అధికంగా ఫోలవర్లని రాబట్టారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. మోడీ తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం తో కరోనా ని నివారించ వచ్చు అని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే పలువురు మాత్రం ఇంట్లొ ఉండకుండా, బయటికి వెళ్తూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పోలీసుల చేతిలో పనిషమెంట్ పొందిన వారిని చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా చిరు ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు.

చిరు చేసిన పోస్ట్ ఎంతలా ప్రభావితం అయిందంటే అభిమానులు మాత్రమే కాదు, నెటిజన్లు సైతం చిరు స్టైల్ ని అనుసరిస్తున్నారు. చిరు తన తల్లితో దిగిన ఫోటో ని షేర్ చేయగా, మీరు కూడా మీ తల్లితో ఫోటో దిగి పెట్టండి అంటూ వ్యాఖ్యానించారు. దానికి నెటిజన్లు సైతం చిరు కి రిప్లై ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. కరోనా వైరస్ ని కట్టడి చేయడమే కాక, ఇలా పోస్టులు పెట్టడం వలన వారు కూడా ఇంట్లోనే ఉంటున్నరన్న భావం ప్రజల్లో కూడా బలంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా చిరు లేట్ గా సోషల్ మీడియా లోకి అడుగు పెట్టిన, ఇలా నెటిజన్ల ని ఇన్స్పైర్ చేస్తూ ఇంకా మంచి పోస్టులు పెట్టాలని ఆశిద్దాం.

error: Content is protected !!