ఉప్పెన కథ లీక్…షాక్ లో మెగా అభిమానులు

మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్.సాయి ధరమ్ తేజ్ సోదరుడైన ఆయన ఉప్పెన సినిమాతో హీరోగా మనముందుకు రానున్నాడు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో ఈ హీరో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది.కాగా ఈ సినిమాలో హీరో ఆశు అనే నిరుపేద మత్స్యకారుడిగా కనిపిస్తాడు.గొప్పింటికి చెందిన సంజనను అతడు ప్రేమిస్తాడు.అది నచ్చని సంజన తండ్రి విజయ్ సేతుపతి, వారికి నో చెబుతాడు.

దీంతో వారిద్దరు దూరంగా వెళ్లిపోయి సంతోషంగా జీవించాలని అనుకుంటారు.ఇది తెలుసుకున్న విజయ్ సేతుపతి సంజనను ఇంట్లో బంధిస్తాడు.అయినా ఆశును మరిచిపోని సంజనను చూసి ఆశుకు విజయ్ సేతుపతి ఓ ఛాలెంజ్ విసురుతాడు.ఆ ఛాలెంజ్‌ను హీరో ఎలా గెలిచాడనేది సినిమా కథ అని తెలుస్తోంది.

ఇలాంటి పాత కథలు తమిళ ఆడియెన్స్‌ను బాగా మెప్పిస్తాయి.మరి తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతమేర నచ్చుతుందో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.

error: Content is protected !!