కరోనా ఎఫెక్ట్: ఏపీ విద్యుత్ సంస్థల కీలక నిర్ణయం..!

కరోనా కారణంగా రాష్ట్రమంతా లాక్‌డౌన్ ప్రకటించడం, కర్ఫ్యూ వాతావరణం ఏర్పడడంతో ఏపీలో విద్యుత్తు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటి వరకు స్పాట్ బిల్లింగ్ ఉన్నా ప్రస్తుతం కరోనాను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సంస్థలు ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్టు తెలుస్తుంది.

అయితే మీటర్ రీడింగ్ ఆధారంగా విద్యుత్తు వినియోగ ఛార్జీలను సిబ్బంది ప్రతి నెలా ఇంటింటికి వచ్చి అందిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా స్పాట్ బిల్లింగ్ నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే గత మూడు నెలల సగటు విద్యుత్తు వినియోగాన్ని మార్చి నెల విద్యుత్తు బిల్లుగా పరిగణించాలని ఈ మొత్తాన్ని వెబ్సైట్‌లో ఉంచనున్నట్టు తెలిపింది. ఇకపోతే ఈ బిల్లును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని వినియోగదారులకు సూచించింది.

error: Content is protected !!