బిగ్ డిసీషన్: ప్రభుత్వానికి 500 కోట్ల విరాళం ప్రకటించిన టీఆర్ఎస్ నేతలు..!

తెలంగాణలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటుంది. ఈ తరుణంలో కరోనా వైరస్ మీద పోరాటానికై ప్రభుత్వానికి పలువురు విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు సహాయంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ ఒక నెల వేతనాన్ని మరియు ఏడాదికి ఒక్కో ఎమ్మెల్యేకి నియోజకవర్గ అభివృద్ధి కోసం మంజూరయ్యే 3 కోట్ల రూపాయలను కలిపి మొత్తం 500 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించడానికి ముందుకు వచ్చారు. అంతేకాదు ఎంపీలకు నియోజకవర్గ అభివృద్ధి కింద 5 కోట్ల రూపాయలు మంజూరు అవుతాయి. అయితే 16 మంది ఎంపీలకు మంజూరయ్యే మొత్తం 80 కోట్ల రూపాయలను కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి అందిచేందుకు సిద్దమయ్యారు. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీల స్పూర్తి ప్రభుత్వానికి ఎంతో ఉత్సాహం ఇస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఆపద సమయంలో ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు రావడం గొప్ప విషయమని సీఎం కేసీఆర్ అన్నారు.

error: Content is protected !!