మెగా అప్డేట్ : RRR పోస్టర్ చూసి చిరంజీవి ఏమంటున్నారోతెలుసా…?

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి అత్యంత భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం RRR… కాగా ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని ఉగాది కానుకగా బుధవారం నాడు విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. దానికి తోడు అందరి అంచనాలను తల్లక్రిందులు చేస్తూ ఈ చిత్రానికి “రౌద్రం రణం రుధిరం” అనే టైటిల్‌ ను ఖ‌రారు చేశారు దర్శకుడు రాజమౌళి… ఈ పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా రాజమౌళి ఖాతాలో మరొక ఘనమైన విజయం ఖాయమని చెప్పుకుంటున్నారు. అయితే ఈ పోస్టర్ పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.

కాగా “మోషన్ పోస్టర్ కనువిందుగా ఉంది. నా ఒళ్లు గ‌గుర్పొడిచింది. కీర‌వాణి అద్భుత‌మైన సంగీతాన్ని, నేప‌థ్య సంగీతాన్ని అందించారు. రాజ‌మౌళి, చ‌ర‌ణ్‌, తార‌క్ ప‌నితీరు అద్భుతంగా ఉంది. ఈ ఉగాది రోజున అంద‌రిలో ఎన‌ర్జీని నింపారు” అని కామెంట్ పెట్టారు. దీనికి రాజమౌళి సమాధానం ఇస్తూ, “సర్.. మీరు ప్రశంసించడం ఆనందంగా ఉంది. ఉగాది శుభాకాంక్ష‌లు. ట్విట్ట‌ర్‌ కు స్వాగ‌తం” అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ పెట్టారు. ఈ మెగాస్టార్ ట్వీటీతో చిత్రబృందానికి సరికొత్త ఎనర్జీ వచ్చింది.

error: Content is protected !!