సూర్య లేటెస్ట్ సినిమా “ఆహా”లో.!

కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్యకు అటు తమిళ్ తో పాటుగా మన తెలుగులో కూడా మంచి పేరున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు సూర్య నటించిన లేటెస్ట్ చిత్రాల్లో “ఎన్ జి కె” కూడా ఒకటి. అక్కడి వైవిధ్య చిత్రాల దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్న స్థాయి విజయాన్ని అయితే సొంతం చేసుకోలేకపోయింది. కానీ సెల్వ రాఘవన్ పై నమ్మకంతో విదుదలకు ముందు మాత్రం మంచి హైప్ వచ్చింది.

అయితే ఈ చిత్రం విడుదలైన కొన్ని రోజులకే అమెజాన్ ప్రైమ్ లో వచ్చేసినా తెలుగు భాషలో మాత్రం అందులో అందుబాటులోకి రాలేదు. ఒక్క తమిళ్ లోనే అది రాగా ఇప్పుడు తెలుగులో మాత్రం మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో అందుబాటులోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా ఈ ఏప్రిల్ 3 నుంచి అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తుంది. అప్పుడు కానీ మీరు ఈ చిత్రాన్ని మిస్సయితే ఇప్పడు చూసే అవకాశం వచ్చింది.

error: Content is protected !!