ఆమె కథలో వెంకట్ రియల్ లైఫ్ లో ఏం పని చేస్తుంటాడో తెలిస్తే షాకే

బుల్లితెరపై ఆమె కథ సీరియల్ లో వెంకట్ డైరెక్టర్ పాత్ర వేసాడు. అయితే ఈ సీరియల్ లోకి యితడు ఎలా వచ్చాడు ఇతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అని ఆలోచిస్తే, పంజాబీ పరివారానికి చెందిన ఇతడి పేరు నిహాల్ అంటున్నారు. లూథియానా, చండీఘర్ మధ్య ప్రాంతానికి చెందిన ఇతడికి ఓ సోదరుడు ఉన్నాడు. వీరి పేరెంట్స్ ఇంకా పంజాబ్ లోనే ఉన్నారట. తెలుగు రాకపోయినా తెలుగులో అద్భుత నటన చేస్తున్నాడు.

మూవీస్ అంటే చాలా ఇష్టపడే వెంకట్ కి హాలీవుడ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఇక మోడలింగ్ అంటే ఇంకా ఇష్టం. కొన్ని మోడల్ కంపెనీలకు ఫొటోస్ పంపడంతో వెంకట్ ని సెలక్ట్ చేసారు. ఇక ఆమెకథ సీరియల్ టీమ్ కి వెంకట్ ఫ్రెండ్ కావడంతో ఈ సీరియల్ లో వేయడానికి అడిగారట. తెలుగు రాదనీ వెనకడుగు వేయడంతో ట్రైనింగ్ ఇస్తామని చెప్పడంతో ఒకే చేసాడట.

ఇదే సీరియల్ లో రాణిగా నటిస్తున్న మేఘనతో వెంకట్ కల్సి టిక్ టాక్ లు కూడా చేస్తున్నాడట. హంగులు ఆర్భాటాలు లేకుండా ఉండే వెంకట్ చాలా సింపుల్ గా ఉంటాడు. టైం దొరికితే మూవీస్ చూసే యితడు తనకు పెద్దగా టచ్ లేని సోషల్ మీడియాలో అడుగుపెట్టాడట. ఆమె కథ సీరియల్ వలన ఈ మధ్యే సోషల్ మీడియాలో ఫాన్స్ పెరిగారట.

error: Content is protected !!