ఈ రోజే రెండు సినిమాలు… సుధీర్ తలైవర్ ను అడ్డుకుంటాడా.?

ఇప్పుడు లాక్ డౌన్ సమయాన్ని మన తెలుగు ఛానెల్స్ బాగానే వినియోగించుకుంటున్నాయని చెప్పాలి. తమ సీరియల్స్ పాత ఎపిసోడ్స్ సహా అప్పటి వరకు ఉన్న కొత్త స్టాక్ ను అలాగే పలు ఈవెంట్స్ షోలు టెలికాస్ట్ చేస్తూ నెట్టుకొచ్చేస్తున్నారు. అయితే మరికొన్ని ఛానెల్స్ వారు మాత్రం లేటెస్ట్ సినిమాలను టెలికాస్ట్ చేస్తూ తమ వీక్షకులను ఆకట్టుకుంటున్నారు.

అందులో భాగం గానే ఈసారి ప్రతీ శుక్రవారం సరికొత్త సినిమాలతో ట్రెండ్ స్టార్ట్ చేసారు. అలా ఈరోజు శుక్రవారం సందర్భంగా జెమినీ ఛానెల్లో తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “దర్బార్” చిత్రం టెలికాస్ట్ అదే విధంగా ఇదే సమయానికి స్టార్ మా లో తెలుగు బుల్లితెర ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన మొదటి చిత్రం “సాఫ్ట్ వేర్ సుధీర్” అందులోను మొదటి సారి టెలికాస్ట్ కానుంది.

ఒకే సమయంలో అరగంట తేడాతో ఈ రెండు టెలికాస్ట్ కానున్నాయి. మరి ఈ పోటీలో ఎవరు నిలదొక్కుకోగలరు అన్న ప్రశ్న వస్తే తలైవర్ కు సుధీర్ పోటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేవని చెప్పాలి. అలా అని రజినీతో సుధీర్ ను పోల్చడం లేదు కానీ స్మాల్ స్క్రీన్ పై సుధీర్ ఫేమ్ వేరేగా ఉంటుంది ఆ కోణంలో చూసినట్లయితే ఖచ్చితంగా సుధీర్ సినిమాకు కూడా మంచి ఆదరణ వచ్చే అవకాశం ఉంది.