మానవత్వాన్ని చాటుకున్న ప్రముఖ విలన్ – విషయం తెలిస్తే సెల్యూట్ చేస్తారు

దేశమంతటా కూడా మహమ్మారి కరోనా వ్యాపిస్తుండడంతో ఎలాగైనా సరే ఈ వైరస్ ని నివారించడానికి దేశమంతటా లాక్ డౌన్ అమలు చేశాయి మన ప్రభుత్వాలు… ఈ లాక్ డౌన్ నేపథ్యంలో మన దేశ చాలా దారుణంగా తయారయిందని అర్థమవుతుంది. ఈ తరుణంలో దేశ ప్రజలందరి కోసమని చాలా మంది సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు అందరు కూడా తమకు తోచినంత సాయాన్ని విరాళాలుగా అందిస్తున్నారు. కాగా ఈ మేరకు మనందరికీ సుపరిచితమైన నటుడు, ప్రముఖ విలన్ సోనూసూద్ తన వంతుగా వైద్యసిబ్బందికి సాయం చేసేందుకు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

కాగా నటుడు సోనూసూద్ కి ముంబై లోని జుహూ ప్రాంతంలో ఒక ఆరంతస్తుల హోటల్ వుంది. అయితే ప్రస్తుతానికి కరోనా భారిన పడ్డ బాధితులందరికీ కూడా చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి ముంబైలోని తన హోటల్‌ల్లో ఉండటానికి చక్కటి అవకాశాన్ని కల్పించాడు సోనూసూద్… అయితే ఇప్పటికే ఈ విషయాన్ని ఇప్పటికే ముంబై మున్సిపల్ అధికారులు, ప్రైవేట్ ఆసుపత్రుల దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించాడు. అంతేకాకుండా వైద్యులకు ఈ చాలా గౌరవంగా భావిస్తున్నానని వెల్లడించాడు సోనూసూద్…

అంతేకాకుండా “ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రోజంతా శ్రమిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి చిన్న సాయం చేసే అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నా. వాళ్లంతా ముంబైలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సేవ చేస్తున్నారు. వాళ్లు విశ్రాంతి తీసుకునేందుకు ఒక చోటు కావాలి. అందుకు మా హోటల్‌ను వినియోగించుకోవాలని మున్సిపల్, ప్రైవేట్ ఆసుపత్రులకు తెలిపాం” అని సోనూసూద్ పేర్కొన్నాడు.