పూరి జగన్నాథ్ పెళ్ళికి తాళి బొట్టు కొనిచ్చిన టాప్ యాంకర్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో పైకొచ్చిన దర్శకులలో రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఒకరు.ఈయన సినిమాల్లోకి వచ్చిన మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పలు సినిమాలకు పని చేశాడు.అయితే ఆ తర్వాత దర్శకుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన టువంటి బద్రి అనే చిత్రంతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు.వచ్చి రావడంతోనే మంచి సాలిడ్ హిట్ అందుకున్నటువంటి పూరి జగన్నాథ్ ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.కానీ అంతకు ముందు మాత్రం పూరి జగన్నాథ్ చాలా కష్టాలు పడ్డాడు.తాజాగా పూరి జగన్నాథ్ తన పెళ్ళికి సంబందించిన పలు ఆసక్తికర అంశాలను తన అభిమానులతో పంచుకున్నాడు.

అప్పట్లో పూరి జగన్నాథ్ అక్కినేని నాగార్జున నటించిన “నిన్నే పెళ్ళాడుతా” అనే చిత్రానికి పనిచేస్తున్న సమయంలో తన భార్యను ప్రేమించానని, అనుకోని కారణాలవల్ల వెంటనే ఆమెను పెళ్లి కూడా చేసుకోవాల్సి వచ్చిందని కూడా తెలిపాడు.కానీ తన భార్యను పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో తన వద్ద డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే తన స్నేహితురాలు యాంకర్ ఝాన్సీ తాళిబొట్టు కొన్ని ఇచ్చిందని, అలాగే ఆర్టిస్టుగా పని చేస్తున్నటువంటి హేమ పట్టుబట్టలు కొని తెచ్చిందని తెలిపాడు.

మరికొందరు తన స్నేహితులు కూడా తన పెళ్లికి కావలసిన సామాగ్రి ఈ విషయంలో సహాయం చేశారని అలాంటి పరిస్థితుల్లో తాను పెళ్లి చేసుకుంటానని ఊహించలేదని, కానీ తన స్నేహితులు చేసిన సాయం మాత్రం ఎప్పటికి మరిచి పోలేదని కొనియాడాడు.ప్రస్తుతం పూరి జగన్నాథ్ టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న “ఫైటర్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలు కీలక సన్నివేశాలు ముంబై నగరంలో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత కరణ్ జోహార్ మరియు టాలీవుడ్ హీరోయిన్ ఛార్మిక కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.