ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలో స్టార్ హీరో విలన్ గా నటిస్తున్నాడట…ఎవరో తెలుసా?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ‘బాహుబలి’ సిరీస్‌తో నేషనల్ వైడ్‌గా పెరిగింది. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో ప్రభాస్‌కు ఇండియా వైడ్‌గా మార్కెట్ ఏర్పడ్డమే కాదు, గ్లోబల్ స్టార్‌గా మారాడు. ఇక బాహుబలి తర్వాత సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. ఈ సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకున్నఓవరాల్గా రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. తెలుగులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేకపోయినా.. బాలీవుడ్లో మాత్రం రూ.200 కోట్ల భారీ వసూళ్లను సాధించి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పూర్తి లవ్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పెద నాన్న కృష్ణంరాజు కీ రోల్ పోషిస్తున్నాడు.
రాధాకృష్ణ సినిమా తర్వాత ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇప్పటి వరకు తెలుగు తెరపై రాని సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్లో సి.అశ్వినీదత్ ఖర్చుకు వెనకాడకుండా భారీ ఎత్తన తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా కాకుండా ప్యాన్ వరల్డ్ రేంజ్లో ఉంటుందని నాగ్ అశ్విన్ చెప్పాడు. ఈ సినిమా కోసం ప్రభాస్.. ఏకంగా రూ.70 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్టు తెలుస్తుంది. ఒక యేడాదిలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని షరతు విధించాడట.ఈ సినిమాలో హీరోతో సమానంగా విలన్ పాత్ర ఉందని చెబుతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం అరవింద్ స్వామిని తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నారట.
ఇప్పటికే ధృవ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త విలనిజాన్ని చూపించిన అరవింద్ స్వామి అయితే బాగుటుందని భావించి ఇప్పటికే ఫోన్లో మాట్లాడి ఈ చిత్రంలో ఆయన పాత్ర గురించి వివరించారట. దానికి అరవింద్ స్వామి కూడా ఓకే చెప్పినట్టు వినికిడి. ఇపుడు ప్రభాస్ సినిమాలో తన విలనిజాన్ని ఏ రకంగా ప్రదర్శిస్తాడో చూడాలి. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ కారణంగా అన్ని రకాల షూటింగ్స్ రద్దు చేసారు. అయితే లాక్డౌన్ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌కు సంబంధించిన వర్క్ నాగ్ అశ్విన్ కంప్లీట్ చేసి, స్క్రిప్ట్ కూడా లాక్ చేసాడట. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కియారా అద్వానీ నటించబోతున్నట్టు టాక్. ఈ సినిమా వచ్చే యేడాది సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు.