నాగ చైతన్య సవ్యసాచి సినిమా ప్లాప్ కావటానికి అసలు కారణాలు ఇవే

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.అయితే గతంలో వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న సమయంలో ప్రేమమ్ వంటి సినిమాతో అదిరిపోయే హిట్‌ను చైతూకు డైరెక్టర్ చందూ ముండేటి అందించాడు.ఈ సినిమా అదిరిపోయే సక్సెస్ అందుకోవడంతో చైతూతో మరో సినిమాను తెరకెక్కించాడు చందూ ముండేటి.అయితే పూర్తి యాక్షన్ డ్రామాగా ‘సవ్యసాచి’ చిత్రాన్ని తెరకెక్కించాడు ఈ డైరెక్టర్.

కాగా ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు మంచి అంచనాలే ఉన్నా, రిలీజ్ అయ్యాక మాత్రం బోల్తా కొట్టింది.ఈ సినిమా కథ కొత్తగా ఉన్నా కమర్షియల్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ సినిమా పోయిందని చిత్ర దర్శకుడు చందూ ముండేటి తాజాగా తెలిపాడు.

ఈ సినిమా ఫెయిల్యూర్‌కు పూర్తి బాధ్యత తనదేనని చైతూకి చెప్పినట్లు, దానికి ఆయన ఎలాంటి నెగెటివిటీ చూపించలేదని అన్నాడు.ఇలా ఓ సినిమాను ఫెయిల్యూర్‌గా మలిచిన దర్శకుడితో తన స్నేహాన్ని కొనసాగించడం ఒక్క చైతూకే చెందిందని చందూ ముండేటి అన్నాడు.

ఇప్పటికీ తనకు చైతూతో మంచి స్నేహం ఉందని, ఇటీవల కార్తికేయ 2 చిత్ర టీజర్ రిలీజ్ చేసినప్పుడు తనకు బెస్ట విషెస్ కూడా చెప్పారని చందూ ముండేటి తెలిపాడు.ఇక ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్‌తో కలిసి కార్తికేయ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న చందూ ముండేటి మరోసారి తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు.