లూసీఫర్ రీమేక్‌లో మెగాస్టార్ తో కల్సి నటించే స్టార్ హీరో ఎవరో తెలుసా?

కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమాలో చేస్తున్న ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఆగింది. లాక్‌డౌన్ అయిపోతే షూటింగ్ పూర్తి చేయాలని కొరటాల శివ చూస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత మలయాళ బ్లాక్‌బస్టర్ లూసీఫర్ మూవీని తెలుగులో చిరంజీవి రీమేక్ చేయబోతున్నాడు. ఈ బాధ్యతను సాహో డైరెక్టర్ సుజీత్‌కు అప్పగించాడు. ఈ చిత్రంలో మోహన్ లాల్ పాత్ర చిరంజీవి చేస్తున్నాడు. అయితే మరో కీలక పాత్ర పృథ్వీరాజ్ పాత్ర.. కోసం తెలుగులో చాలా మంది హీరోలను చూస్తున్నారు. ఒకదశలో అల్లు అర్జున్ పేరు వినిపించింది. అయితే బన్నీ కాదని పిఆర్ టీం తెలిపింది.

ఈనేపధ్యంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పేరు వార్తల్లో రాగా, అదేంలేదని చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మరో హీరో పేరు వినిపిస్తుంది. చిరంజీవితో ఈ చిత్రంలో నటించబోయే ఆ స్టార్ ఎవరో కాదు రానా దగ్గుబాటి అని లేటెస్ట్ టాక్. కథ నచ్చితే పాత్ర ఏంటని కూడా అడగడు రానా. హీరోనా విలనా అనే తేడా లేకుండా చేయడానికి రెడీ అయిపోతాడు. ఇప్పుడు కూడా లూసీఫర్ రీమేక్‌లో పృథ్వీ పాత్రకు రానా అయితే సరిపోతాడని చిరు కూడా భావిస్తున్నట్లు టాక్. అందుకే సుజీత్ కథ చెప్పడం.. రానా కూడా ఓకే చేయడం అయిందన్న మాట వినిపిస్తోంది.

గతంలో మాదిరిగా తెలుగులో మల్టీస్టారర్స్ ట్రెండ్ నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆచార్యతో కూడా రామ్ చరణ్‌తో కలిసి మెగాస్టార్ నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత వెంటనే మరోసారి రానాతో కలిసి మల్టీస్టారర్‌కు సిద్ధమవుతున్నాడు. ఏదేమైనా కూడా చిరంజీవి, రానా కాంబినేషన్ మాత్రం హై రేంజ్ లో ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. అన్నీ కుదిర్తే వచ్చే ఏడాది లూసీఫర్ తెలుగు రీమేక్ పట్టాలెక్కనుంది. 2021లోనే విడుదల చేయాలని చూస్తున్నాడు సుజీత్. తెలుగులో చిరంజీవి ఇమేజ్‌కు సరిపోయేలా కథలో సుజీత్ చాలా మార్పులు చేర్పులు తీసుకొస్తున్నట్లు సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.