రానా పెళ్లి వార్త ప్రభాస్ పై ఒత్తిడి పెంచేస్తుంది..ప్రభాస్ ఎప్పుడు చెప్పుతాడో…?

రానా చడీచప్పుడు లేకుండా తనకు కాబోయే అర్థాంగిని పరిచయం చేశాడు. ఆయన తన స్నేహితురాలు మిహికా బజాజ్ ని త్వరలో పెళ్లి చేసుకొన్నారు. లాక్ డౌన్ అనంతరం వీరి పెళ్లి ఉంటుందని కుటుంబ సభ్యులు కూడా ధ్రువీకరించారు. ఐతే పెళ్లి విషయంలో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ప్రభాస్ పై ఇప్పుడు మరింత ఒత్తిడి పెరిగిపోయింది. సోషల్ మీడియా వేదికగా బల్లాలదేవ ప్రకటించేశాడు, మరి బాహుబలి సంగతి ఏమిటని గట్టి డిమాండ్ వినిపిస్తుంది. అందులోను ప్రభాస్ రానా కంటే వయసులో కూడా పెద్ద వాడు.

మరి ఈ డిమాండ్స్ కి ప్రభాస్ ఏమి సమాధానం చెవుతాడో చూడాలి. బాహుబలి తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని అప్పట్లో గట్టిగా వినిపించింది. ఆ సినిమా విడుదలై ఇప్పటికి 3ఏళ్ళు అవుతుంది. అలాగే ప్రభాస్ ప్రస్తుతం మరో రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అందులో ఒకటి నిర్మాణ దశలలో ఉండగా మరొకటి ఆక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ప్రభాస్ పెళ్లి ఎప్పుడనే దానిపై మాత్రం స్పష్టత రావడం లేదు.