తెలంగాణాలో లాక్ డౌన్ మరింతగా కఠినం కానుందా…?

తెలంగాణ రాష్ట్రంలో మహమ్మారి కరోనా తీవ్రత అధికంగాఉన్న తరుణంలో రాష్ట్రంలో లాక్ డౌన్ ని చాలా కఠినంగా అమలు చేయడానికి, ఎట్టి పరిస్థితులలోను సడలింపులు చేయకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలు కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. కాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి పలుకీలకమైన చర్యల కారణంగా రాష్ట్రంలో మహమ్మారి కరోనా తీవ్రత చాలా వరకు తగ్గిపోయింది. కానీ కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దారుణంగా పెరుగుతూ ఉండటంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖా అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు.

కాగా ప్రస్తుతానికి రాష్ట్రంలో నమోదవుతున్నటువంటి కరోనా కేసుల్లో దాదాపుగా 90 శాతం కేసులు హైదరాబాద్ లోనే నమోదవుతుండటంతో హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోకూడా లాక్ డౌన్ నిబంధనలను చాలా కఠినంగా అమలు చేయడానికి అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కాగా ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 15 న ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాగా ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశాలున్నాయి. అయితే నిజానికి ఈ నెల 29 వరకే లాక్ డౌన్ ఉండనుందని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. కానీ ప్రస్తుతానికి పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఈ లాక్ డౌన్ మళ్ళీ పొడిగించే అవకాశాలు లేకపోలేదు.

error: Content is protected !!