సీఎం కేసీఆర్ మరొక సంచలన నిర్ణయం – రాష్ట్ర ప్రజలందరికి…

తెలంగాణ రాష్ట్రంలో భయంకరంగా పెరుగుతున్నటువంటి మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ని చాలా ఖఠినంగా అమలు చేస్తున్నారు. అయితే ఈ మహమ్మారి కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కఠినమైన చర్యల కారణంగా రాష్ట్రంలో కరోనా తీవ్రత చాలా వరకు తగ్గిందని అధికారులు వెల్లడించారు. కానీ ప్రస్తుత పరిస్తితుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో రోజురోజుకు పెరుగుతున్నటువంటి మహమ్మారి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల కారణంగా ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు.

ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరొక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా అకస్మాత్తుగా రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి కరోనా కేసుల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ కరోనా నిర్దారిత పరీక్షల కోసం ప్రజలు ఎవరు కూడా రాకుండా, కేవలం వైద్య సిబ్బంది మాత్రమే ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా ఈ విషయాన్నీ జిల్లా వైద్య అధికారులు, హాస్పిటల్ సూపరింటెండెంట్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్స్, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.

error: Content is protected !!