ఆ నాలుగు ప్రాంతాలలోనే ఎక్కువ కేసులు – సీఎం కేసీఆర్

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత ఐదు రోజులుగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండగా, నేడు కూడా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. నేడు మరో 40 పాజిటివ్ కేసులు నమోదు కాగా జీహెచ్ఎంసీ పరిధిలో 33 కేసులు, వలస కూలీలలో ఏడుగురికి కరోనా సోకినట్టు తేలింది. అయితే గత కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీతో పాటు, వలస కూలీలతోనే కొత్త కేసులు నమోదవుతున్న నేపధ్యంలో నేడు రాష్ట్ర వైద్యాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

అయితే రాష్టంలో నమోదవుతున్న కేసులన్ని జీహెచ్ఎంసీ పరిధిలోనే అని ఎక్కువగా ఇప్పుడు చార్మినార్, ఎల్‌బి నగర్, మలక్‌పేట్, కార్వాన్ ప్రాంతాలలోనే కేసులు నమోదవుతున్నట్టు తెలిపారు. అయితే ఈ ప్రాంతాలలో 1442 కుటుంబాలు ఉన్నాయని, మే 17 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సూచనలను అనుసరించి లాక్‌డౌన్ సడలింపులపై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.

error: Content is protected !!