బైక్‌పై చైతూ, సామ్‌ అంత దూరం ప్రయాణించారా?

అక్కినేని జంట నాగచైతన్య మరియు సమంత లాక్‌డౌన్‌ను ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు.వీరిద్దరు కలిసి ఇన్నాళ్లు ఇంట్లోనే ఉంటూ టైం పాస్‌ చేశారు.ఎట్టకేలకు కాస్త సడలింపులు ఇవ్వడంతో బయట తిరుగుతున్నారు.కొన్ని రోజుల క్రితం సమంత కారులో బయటకు వెళ్తున్న ఒక ఫొటోను షేర్‌ చేసింది.తాజాగా బైక్‌పై చైతూతో లాక్‌ డ్రైవ్‌అంటూ ఒక ఫొటోను షేర్‌ చేసింది.వీరిద్దరు కలిసి చక్కర్లు కొడుతున్నట్లుగా ఈ ఫొటోలు చూస్తుంటే అర్థం అవుతోంది.తాజాగా నాగచైతన్య మరియు సమంతలు కలిసి బైక్‌పై హైదరాబాద్‌ నుండి చెన్నై వెళ్లారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.లాక్‌ డౌన్‌ నిబంధనలు ఉన్నా కూడా వీరిద్దరు మరో నలుగురితో కలిసి ఈ సాహస యాత్ర చేసినట్లుగా చెబుతున్నారు.

చెన్నైలో ఒక కీలకమైన కార్యక్రమానికి వీరు హాజరు అవ్వాల్సి ఉండగా వీరు సాహసం చేశారనే టాక్‌ వినిపిస్తుంది.సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరు ఈ ఏడాది కలిసి ఒక సినిమా చేయాలనుకున్నారు.కాని అది కుదరలేదు

నాగచైతన్య త్వరలో లవ్‌ స్టోరీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఆ తర్వాత విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు.ఇక సమంత గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ ఏడాది మాత్రం ఈమె చేయబోతున్న సినిమా ఏది కూడా ప్రారంభం కాలేదు.వచ్చే ఏడాది ఈమె రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.