సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం – రాష్ట్రంలో నేటి నుండి తెరుచుకునేవి ఇవే…?

తెలంగాణ రాష్ట్రంలో మహమ్మారి కరోనా తీవ్రత అధికంగా ఉన్న తరుణంలో, రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న కరోనా నివారణ చర్యల్లో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ని చాలా కఠినంగా అమలు చేశారు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కరోనా తీవ్రత చాలా వరకు తగ్గడంతో లాక్ డౌన్ నుండి పలు రంగాలకు సడలింపులు, మినహాయింపులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుందని చెప్పాలి. కాగా రాష్ట్రంలో చాలా జిల్లాలు కరోనా ఫ్రీ అవడంతో నేటి నుండి పలు రంగాలకు వెసులుబాట్లు కల్పిస్తూ, సడలింపులకు తెరతీసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో మరికొన్ని ఉపాధి రంగ సంస్థలు తెరుచుకోనున్నాయని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి ఆటోమొబైల్ షోరూంలు, స్పేర్ పార్ట్స్ షాపులు, ఏసీలు, ఎయిర్ కూలర్లు అమ్మే షాపులు తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇకపోతే ఈ నెల 17 తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విధించినటువంటి మూడో లాక్‌డౌన్ కాలం కూడా ముగియడంతో, కేంద్రం సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేయనుంది. కాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి మద్యం షాపులు, రిజిస్ట్రేషన్‌ ఆఫీసులు, ఆర్టీఏ ఆఫీసులు నడుస్తున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలన్నీ అమలవుతున్నాయి. మరికొద్దిరోజుల్లో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా తిరిగి ప్రారంభం కానున్నాయని సమాచారం.

error: Content is protected !!