నేడే తెలంగాణ కేబినెట్ భేటీ – నేడు చర్చించే అంశాలు ఏంటో తెలుసా…?

దేశంలో మహమ్మారి కరోనా తీవ్రత బీభత్సంగా పెరుగుతున్న తరుణంలో, కరోనా నివారణకై దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. కాగా దేశంలో పలు చోట్ల కరోనా తీవ్రతపెరుగుతున్న కొద్దీ, లాక్ డౌన్ గడువు కాలాన్ని కూడా పెంచుతున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కారణంగా మే 29 వరకూ లాక్‌డౌన్ ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. కానీ ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం, లాక్‌డౌన్ 4 తో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మార్గదర్శకాలు అన్ని కూడా నేడు జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.

కాగా నేడు సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. కాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయని అధికారులు వెల్లడించగా, కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే కేసులు నమోదవడంతో తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనున్న మినహాయింపులు, సడలింపుల కోసం అందరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే రాష్ట్రంలో చాలా కఠినంగా అమలులో ఉన్నటువంటి లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలంగా చేయడంతో పాటు సాగునీటి అంశాలపైనా చర్చ జరగనుందని సమాచారం.