రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కుతాయా – సీఎం కేసీఆర్ నిర్ణయం ఏంటి…?

తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న మహమ్మారి కరోనా కారణంగా, రాష్ట్రంలో లాక్ డౌన్ ని చాలా కఠినంగా అమలు చేశారు. ఈ లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుతున్న తరుణంలో ఇన్నిరోజులు నిలిచిపోయినటువంటి ఆర్టీసీ సేవలు పున:ప్రారంభం కానున్నాయా.. అనే అనుమానం అందరి మదిలో మెదులుతుంది. అయితే ఈ విషయంలో ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా అందినట్లు సమాచారం. అయితే మంగళవారం నుండి రాష్ట్రంలో బస్సులు నడిపేలా ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయమై నేడు సాయంత్రం 5 గంటలకు జరగనున్నటువంటి కేబినెట్ భేటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే రాష్ట్రంలో బస్సులు నడపడానికి అనుమతులు ఇస్తూ, పలు షరతులు కూడా విదించనున్నారని సమాచారం. అంటే బస్సుల్లో కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ, ప్రయాణికులు అందరు కూడా మొహాలకు మాస్కులు ధరించేలా, అంతేకాకుండా బస్సుల్లో కూడా శానిటైజర్ వాడేలా పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇకపోతే జీహెచ్‌ఎంసీ మినహా… రాష్ట్రంలోని గ్రీన్, ఆరెంజ్ జోన్లు పెరిగిన నేపథ్యంలో బస్సులు నడపడానికి ప్రభుత్వం ఆలోచిస్తుందని సమాచారం. కాగా నేడు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఈ విషయాన్నీ వెల్లడించనున్నారని సమాచారం.