లాక్ డౌన్ సమయంలో చిరు దినచర్య ఏమిటో చూడండి

లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అవుతున్న చిరంజీవి తన వ్యాపకాలతో పాటు దిన చర్యను అభిమానులతో పంచుకున్నారు. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టిన చిరు ప్రతిరోజు 40నిముషాలు వ్యాయామం చేస్తున్నారట. అలాగే రెండు సార్లు స్విమ్ చేస్తున్నారట. ఇక తనకు ఐదేళ్ల ప్రాయం నుండి వంటపై అవగాహన ఉందట. వాళ్ళ అమ్మగారికి వంటలో సహాయం చేసే క్రమంలో అనేక వంటకాలు నేర్చుకున్నారట. ఖాళీ దొరికినప్పుడల్లా రుచికరమైన ఉప్మా, న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్ వంటివి చేస్తూ ఉంటారట. దీనితో వెండితెరపై సూపర్ డాన్స్, అద్భుతమైన నటనతో అలరించే మా చిరులో మంచి చెఫ్ కూడా ఉన్నాడా, అని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివతో ఆచార్య అనే మూవీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 40శాతం వరకు పూర్తి అయ్యింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడగా త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.