స్టార్ హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కొరటాల శివ

అపజయమంటూ ఎరుగని డైరెక్టర్, రాజమౌళి తర్వాత అంత సక్సెస్ రేటు ఉన్న టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ గారు. ఈయన తన సినిమాల్లో హీరోలను బాగా ఎలివేట్ చేస్తుంటాడు.కొరటాల శివ మెసేజ్స్ మూవీస్ , హీరోయిజం లాంటి సినిమాలు తీయడంలో కొట్టిన పిండి. అందుకే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. తన సినిమాలలో నటించే నటులను ఏ పాత్రలకు ఎన్నుకోవాలో లాంటి ఆసక్తికర విషయాలను ప్రేక్షకులకు తెలిపారు . ఎంత స్టార్డం ఉన్న నటీనటులు అయినా ఆ పాత్రకు అవసరమైనంత వరకే వాడుకోవాలి. ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నావ్ కదా అని , వాళ్ల కోసం లేని సన్నివేశాలను సృష్టించకూడదు.

అలా చేస్తే ఆ ప్రభావం సినిమా పై పడుతుంది.అందుకే నా సినిమాల్లో నటించే యాక్టర్స్ ను ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతవరకే ఇస్తాం. అలాగని వారిని ఇబ్బంది పెట్టడం వంటివి చేయడం మంచిది కాదు, అని చెప్పారు.కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారితో ఆచార్య మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం గెస్ట్ రోల్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కన్నడ భామ రష్మిక మoదన్న నటిస్తున్న విషయం తెలిసిందే.