సమంతా బాట పడుతున్న ముద్దుగుమ్మలు…అసలు కథ ఇదే…!

ఏదైనా ఒకరు అనుసరిస్తే, అది బాగుంటే అందరూ అదే బాట పడతారు. లేకుంటే సీన్ మరోలా ఉంటుంది. అయితే అక్కినేని కోడలు సమంత బాట కరెక్ట్ అని కాజల్ అగర్వాల్ అడుగులు వేస్తుంటే ,ఆ రూటే మంచిదంటూ మిగిలిన టాలీవుడ్ భామలు కూడా సై అంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే,.. ప్రస్తుతం కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడం.. దీనికి తోడు ఇంటర్నెట్ సేవలు కూడా అందరికి అనుకూల ధరల్లో ఉండడంతో ఇండియాలో డిజిటల్ మీడియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎంటర్‌టైన్మెంట్ రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు ఇండియా బాట పడుతున్నాయి.

ఇక అందులో భాగంగా ఇండియాలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు చాలా ప్రాచుర్యం అందుకుంటున్నాయి. ఈ సంస్థలు సొంతంగా కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటినే మనం ఒరిజనల్స్‌గా చెప్పుకొస్తున్నారు. ఈ ఒరిజనల్స్‌లో హిందీలో కియారా నుండి రాధికా ఆప్టే వరకు వెబ్ సిరీస్‌లు చేస్తూ అటూ డిజిటల్‌లో ఇటూ సినిమాల్లో మంచి అవకాశాలు పొందుతున్నారు. తెలుగులో కూడా ఇలాంటీ కల్చర్ ఇప్పుడిప్పుడే వస్తోంది. ఆ మధ్య జగ్గుబాయ్ ఓ వెబ్ సీరిస్‌లో అదరగొట్టేసింది. ఇప్పటికే జయలలిత తమిళంలో జయలలిత ‘ది క్వీన్’ అనే వెబ్ సిరీస్ చేసింది. తాజాగా హీరోయిన్ కాజల్ కూడా కూడా వెబ్ సిరీస్‌లో నటించడానికి సై అంటోందట.

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రుపొందిస్తున్న ఓ వెబ్‌సిరీస్‌లో అందాల కాజల్ నటించేందుకు ఒకే అందట. మొదట తమిళంలో తెరకెక్కనున్న ఈ వెబ్‌సిరీస్ ఆ తర్వాత తెలుగులోకి కూడా విడుదల కానుంది. కాగా మరో తెలుగు టాప్ హీరోయిన్ సమంత కూడా అమెజాన్ ప్రైమ్ వెబ్‌సిరీస్‌.. ఫ్యామిలీ మ్యాన్‌లో నటిస్తోంది. అయితే సినిమాలతో పోల్చితే.. డిజిటల్‌లో కంటెంట్‌ను అనుకున్న విధంగా.. చెప్పడమే కాకుండా.. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ.. దీంతో హీరోయిన్స్ మాత్రమే కాకుండా.. ఇటు డైరెక్టర్స్ కూడా డిజిటల్ బాట పడుతున్నారు. ఇప్పటీకే తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి వంటివారంతా డిజిటల్ వైపు చూస్తున్నారు.