నితిన్, రాణాలపై వరుణ్ రిప్లై చూడాల్సిందే.!

ఇప్పుడు మన టాలీవుడ్ పెళ్లిళ్ల సీజన్ లా మారిపోయింది. కొన్నాళ్లుగా సింగిల్ లైఫ్ లోనే ఉండిపోయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ అంతా ఇప్పుడు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దీనితో టాలీవుడ్ నటుల మధ్య కాస్త సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే హీరో నిఖిల్ పెళ్లి చేసేసుకున్నాడు.

యూత్ స్టార్ నితిన్ మరియు మన టాలీవుడ్ హల్క్ రాణా కూడా తమ జీవిత భాగస్వాముల కోసం అభిమానులకు పరిచయం చేసి త్వరలోనే తాము కూడా ఒక ఇంటివారు అవ్వబోతున్నామని చెప్పేసారు. దీనితో మెగా ప్రిన్స్ వరుణ్ కు సాయి ధరమ్ తేజ్ ఓ ట్వీట్ ద్వారా ఏం బావ నీకు కూడా పెళ్ళంటా అని సరదాగా అడగ్గా దానికి వరుణ్ ఇచ్చిన రిప్లై చూడాల్సిందే.

“దానికి ఇంకా చాలా టైం ఉంది కానీ మన రాణా, నితిన్ లు ఎప్పటికీ సింగిల్ అంటూనే సింపుల్ గా సింగిల్స్ గ్రూప్ నుంచి బయటకు వెళ్లిపోయారు” అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఇది మాత్రం ఎపిక్ రిప్లై అని చెప్పాలి. దీనితో ఈ రిప్లై సోషల్ మీడియాలో మంచి హాట్ టాపిక్ అవుతుంది.