రానా – మిహిక రోకా వేడుకకు నాగార్జున రాకపోవటానికి కారణం ఇదేనట

టాలీవుడ్ లో ఇన్నాళ్లూ మోస్ట్ బ్యాచిలర్ గా ఉన్న దగ్గుబాటి రానా తాజాగా తన ప్రేయసి మిహికా బజాజ్ ని పరిచయం చేస్తూ పెళ్ళికి రెడీ ప్రకటించాడు. దీంతో సోషల్ మీడియాలో ఈజంట ఫొటోలతో పాటు ఇరు ఫ్యామిలీస్ ఫొటోస్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో రోకా వేడుక జరిగింది. రోకా అనేమాట పంజాబ్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో విన్పించే మాట. మన అబ్బాయి,మన అమ్మాయి అనిపించుకునే తంతునే రోకా అంటారట. అయితే అనేక వార్తా చానళ్ళు,వెబ్ సైట్స్ అయితే రానా, మిహికాల రోకా విషయాన్నీ టాప్ రేంజ్ లో చూపిస్తున్నాయి.

మీడియా లో వీరిద్దరి హడావిడి గురించి హోరెత్తిపోతోంది . ముఖ్యంగా రోకా పేరిట జరిగిన రానా – మిహికా ల ఫంక్షన్ కి రెండు కుటుంబాల ముఖ్యులు హాజరయ్యారు. అయితే ఇందుకు సంబంధించి ఫోటో బయటకు రావడంతో నిశ్చితార్ధం జరిగిపోయిందంటూ చెప్పేయడం, రాసెయ్యడం అయిపొయింది .నిజానికి అది నిశ్చితార్ధం కాదని, రోకా వేడుక అని రానా తండ్రి దగ్గుబాటి సురేష్ బాబు స్పందిస్తూ చెప్పారు. రోకాలో ఇరు కుటుంబాలు చిన్న చిన్న కానుకలు, స్వీట్లు ఇచ్చి పుచ్చుకుంటారట. ఇందుకు సంబంధించిన ఫోటోనే అది అని సురేష్ బాబు చెప్పారు.

మిహికా హైదరాబాదీ అయినా, ముంబయి మూలాలు ఉండడంతో రోకా సంప్రదాయం పాటిస్తారట అయితే రోకా వేడుకలో వెంకీ ఫామిలీ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ అయింది. కానీ ఇందులో అక్కినేని నాగార్జున, అమల లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈవిషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగచైతన్య,సమంత వచ్చినా సరే,నాగ్ రాకపోవడం చర్చకు దారితీస్తోంది. సమంతతో పెళ్లయ్యాక నాగచైతన్య దగ్గుబాటి ఫ్యామిలీకి దగ్గర చేస్తోందని, అందుకే నాగ్ దూరంగా ఉన్నాడని ఇలా రకరకాల పుకార్లు వస్తున్నాయి. దీనిపై అక్కినేని ఫ్యామిలీ నుంచి క్లారిటీ రావాల్సి వుంది. కొద్ది రోజుల్లో నిశ్చితార్ధం జరుగుతుందట. . డిసెంబర్ లో రానా ,మిహికాల పెళ్లి జరుగుతుందని టాక్.