బన్నీ మూవీ కోసం ఆ డైరెక్టర్ కి భారీ ఆఫర్…ఎన్ని కోట్లో తెలుసా?

‘బృందావనం’ ‘మున్నా’ ‘బిందాస్’ చిత్రాలతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. దర్శకునిగా మారిన రచయితలలో కొరటాల శివ తొలి విజయంతో టాలీవుడ్ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నాడు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో ‘శ్రీమంతుడు’ , జూనియర్ ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ మళ్ళీ మహేష్ తో ‘భరత్ అనే నేను’ వంటి అద్భుతమైన సూపర్ హిట్ చిత్రాలను అందించాడు. ఓ సోషల్ ఇష్యూకి కమర్షియల్ హంగులను జోడించి ఆడియన్స్ కి అవసరమైన దాన్ని సమపాళ్లలో అందించే సత్తా ఉన్న డైరెక్టర్ కొరటాల శివ టాలీవుడ్ లో 100 పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టరుగా, మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. శివ దర్శకత్వంలో సినిమా అంటే అది పక్కా హిట్ అనే ప్రేక్షకుల భావన.

సూపర్ స్టార్ మహేష్ అంతటి వాడే కనీసం క్యారెక్టర్ ఏంటని అడగకుండా సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడంటేనే కొరటాల స్టామినా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల డైరెక్షన్ లో ‘ఆచార్య’ అనే సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ , మాట్నీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఆచార్య’ సినిమా తర్వాత కొరటాల శివ ఏ హీరోతో సినిమా చేస్తాడా అనే ఆసక్తి అందరిలో ఎక్కువైంది. అయితే గత కొన్ని రోజులుగా కొరటాల నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ చేయబోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కొరటాల చెప్పిన స్టోరీ లైన్ బన్నీకి బాగా నచ్చిందట.

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. తర్వాత వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత కొరటాల సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందట. అందుకే ప్రస్తుతం దొరికిన ఈ లాక్ డౌన్ సమయంలో బన్నీని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ వర్క్ డెవలప్ చేసే పనిలో కొరటాల ఉన్నాడట. ఈ సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్న గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ ఈ సినిమా కోసం డైరెక్టర్ కొరటాల శివకు ఏకంగా 13 కోట్లు ఆఫర్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చెవులు కోరుతుక్కుంటున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని అల్లు అరవింద్ భావిస్తున్నాడట. అందుకే కొరటాల – బన్నీ కాంబోలో తెరకెక్కబోయే సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించాలని అనుకుంటున్నాడట.