ఈ రోజు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష.. వీటిపైనే ప్రధాన చర్చ..!

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ, వర్షాకాల వ్యవసాయం, రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలపై చర్చించనున్నారు.

అయితే కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలు, మే 31న లాక్‌డౌన్ ముగుస్తుండడంతో లాక్‌డౌన్ పెంచాలా లేదా ఎత్తివేయాలా అనే దానిపై కూడా ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఇకపోతే వర్షాకాలం వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై, గ్రామాల్లో ఎరువుల లభ్యత ఉందా లేదా, విత్తనాలు అందుబాటులో ఉన్నాయా లేవా అనే విషయాలపై కూడా చర్చించబోతున్నట్టు సమాచారం. ఇక జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాట్లపై కూడా ఓ నిర్ణయం తీసుకునున్నట్టు తెలుస్తుంది.

error: Content is protected !!