లాక్ డౌన్‌లో కాజల్ చేసున్న పనేంటో తెలుసా ?

మహమ్మారి కరోనా నేపథ్యంలో ప్రస్తుతం సినిమాల షూటింగ్స్ అన్ని బంద్ అయ్యాయి. సినిమా హాల్స్ కూడా మూసేసారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి. అయితే ఈ సమయంలో సినీ సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితం అయ్యారు. తమకు నచ్చిన వాటిల్లో ప్రతిభ చూపించడం,కొత్త కొత్త అంశాలు నేర్చుకోవడం వంటివి చేస్తున్నారు. ఇంట్లోనే ఉంటున్న కాజల్ అగర్వాల్ కాజల్ తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఒత్తిడికి గురి కాలేదని చెబుతోంది. ఎలాంటి కష్టాలొచ్చినా ఒత్తిడికి లోనవను. సావధానంగా ఆలోచిస్తాను. ఇప్పుడు కూడా అంతే’అని చెప్పేసింది.

అయితే ఈ లాక్ డౌన్ సద్వినియోగం చేసుకుంటున్నా. ఏమాత్రం ఒత్తిడి పడడం లేదు. ఆన్ లైన్లో కొత్త కోర్సులు నేర్చుకుంటున్నా. ఇష్టమైన బుక్స్ చదువుకుంటున్నా. అప్పుడప్పుడు వంట చేస్తున్నా. ఇలా బిజీగా వుంటే ఒత్తిడి అన్నదే రాదు’అని కాజల్ చెప్పుకొచ్చింది. మెరుపుతీగను మరిపించే ఈ ఈ అందాల భామను తెలుగుతెరకు తేజ పరిచయం చేసాడు. డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ’ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది.

ఇక అప్పటినుండి దాదాపు ఓ దశాబ్దం కాలంగా తన అందచందాలతో పాటు ఎవరిని నొప్పించని మనసుతో అలరిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్‌గా కూడా గుర్తింపు పొందిన కాజల్ ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది. అయితే కేరిర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన కొంత కుదురుకున్న తర్వాత నటనకు ప్రాధాన్యమున్న సినిమాలతో అభిమానుల్ని సంపాదించుకుంది. కాజల్ ప్రస్తుతం కమల్ హాసన్ భారతీయుడు 2లో నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న ఆచార్యలో కూడ మెరవబోతోంది.