నేడు సీఎం కేసీఆర్ అత్యున్నతస్థాయి సమావేశం.. వీటిపైనే ప్రధాన చర్చ..!

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు అత్య్న్నతస్థాయి సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ, వర్షాకాల వ్యవసాయం, రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలపై చర్చించనున్నారు.

అయితే కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలు, మే 31న లాక్‌డౌన్ ముగుస్తుండడంతో లాక్‌డౌన్ కొన్సాగించాలా లేదా ఎత్తివేయాలా అనే దానిపై కూడా ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఇక జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాట్లపై కూడా ఓ నిర్ణయం తీసుకునున్నట్టు తెలుస్తుంది. అయితే కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపధ్యంలో రేపు సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి రేపుతుంది.

error: Content is protected !!