ఇదో తరహా రాజకీయం .. తారక్ బాటలో మెగాస్టార్

ప్రజారాజ్యం పార్టీ పెట్టి జనంలోకి వెళ్లి, అధికారం రాకపోవడంతో గెలిచిన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లో విలీనం చేసి,కేంద్ర మంత్రి పదవి చేపట్టి,ఆతర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో బిజీ అయ్యాడు. అయితే తాజా పరిస్థితులు మరోసారి రాజకీయాల వైపు మెగాస్టార్ ని నడిపిస్తున్నాయా అనిపిస్తుంది. అయితే రియల్ లైఫ్ పాలిటిక్స్ మాత్రం కాకుండా రీల్ లైఫ్‌లో ఈయన మరోసారి పొలిటికల్ వైపు అడుగులేస్తున్నాడు అని చేప్పాలి.

వివరాల్లోకి వెళ్తే, కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలో చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. నక్సలైట్ పాత్రలో చిరు నటిస్తున్నాడని ప్రచారం జరుగుతూ వచ్చింది. అలాగే ఈ చిత్రం మొదలైన దగ్గర నుంచి కూడా స్టోరీ లైన్ గురించి చాలా వార్తలే వస్తూ ఉన్నాయి.ఇప్పుడు వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ తన సినిమా కథపై కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు. నక్సలైట్ అని ఓ సారి.. పురాతన దేవాలయ సంపదను కాపాడడానికి పోరాడే ప్రొఫెసర్ అని మరోసారి కథలు వినిపించాయి. అయితే ఇది పూర్తిగా పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పాడు. ఆచార్య ఓ పొలిటికల్ థ్రిల్లర్.. అందులో ప్రకృతి వనరులను కాపాడే ఓ వ్యక్తిగా చిరంజీవి పాత్ర ఉంటుందని కన్ఫర్మ్ చేసాడు.

ప్రకృతి ప్రేమికుడు అంటే మనకు ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గుర్తుకు వస్తాడు. గతంలో ఇదే కొరటాల శివ తెరకెక్కించిన జనతా గ్యారేజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ప్రకృతి వనరులను కాపాడే వ్యక్తిగా నటించాడు. ఇఫ్పుడు చిరంజీవి కూడా ఇదే తరహా పాత్రలో నటిస్తున్నాడు. ఆచార్యలో రామ్ చరణ్ కూడా ఉన్నాడని ,అతడికి హీరోయిన్ ఉంటుందని కొరటాల తెలిపాడు. మొత్తానికి చిరంజీవి ఆచార్య సినిమా గురించి చాలా ముచ్చట్లే బయటికి చెప్పడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. షూటింగ్ ఇప్పటి వరకు 40 శాతం పూర్తవ్వడంతో ఫారెన్ కంట్రీస్ అవసరం లేకుండా, మిగిలిన 60 శాతం షూటింగ్ కూడా కేవలం ఇన్‌డోర్‌లోనే షూట్ చేస్తామని కొరటాల చెప్పాడు.