మెగాస్టార్ తో ఆ రోజున మొదలు కానున్న షూటింగ్స్.!?

లాక్ డౌన్ మూలంగా గత రెండు నెలల పాటు టాలీవుడ్ లో షూటింగ్స్ స్తంభించిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. దీనితో టాలీవుడ్ పెద్దలు అంతా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో జరిపిన కీలక భేటీ అనంతరం గ్రెయిన్ సిగ్నల్ ఇచ్చారు. దీనితో మళ్ళీ టాలీవుడ్ యథాస్థితికి రానుంది అని సినీ ప్రేమికులు భావిస్తున్నారు.

అయితే సినిమా షూటింగ్స్ మళ్ళీ ఎప్పటి నుంచి మొదలు అవుతాయి అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఇప్పుడు దానిపై ఒక మెగా క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న “ఆచార్య” చూటింగ్ తోనే మొదలు కానున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం వచ్చే జూన్ 15 నుంచి మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది. ఇదే మొదటి సినిమా అని సమాచారం.