జూనియర్ హీరోలందరూ సైలెంట్ గావుంటే వరుణ్ తేజ్ కి ఎందుకు ?

#varuntej #Chiranjeevi #Balakrishna #NTR #Balakrishna #NBK #Nagababu #Megastar #MAA

వరుణ్ తేజ్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో ‘గడ్డలకొండ గణేష్’ సినిమాలోని పోస్టర్ జత చేస్తూ ”చేతిలో తుపాకీ పట్టుకొని ఉండే మనిషితో ఎవరూ మాట్లాడలేరు” అంటూ కామెంట్ పెట్టాడు. ఇప్పడు వరుణ్ తేజ్ చేసిన ఈ పోస్ట్ ఇండైరెక్ట్ గా బాలయ్యని టార్గెట్ చేసి పెట్టాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో బాలయ్య – నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇష్యూని పరోక్షంగా ప్రస్తావించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే కొంత మంది మాత్రం తన సినిమా పోస్టర్ పోస్ట్ చేస్తే తప్పేముంది అంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో వరుణ్ తేజ్ పోస్ట్ ఎవరినో టార్గెట్ చేయడానికే అనే అనుమానం రాకమానదు. నిజానికి సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న వివాదంపై ఉన్నారు. మెగా హీరో రామ్ చరణ్ సైతం ఎలాంటి బాలయ్య వ్యాఖ్యలపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే వరుణ్ తేజ్ మాత్రం ఇలా ఇండైరెక్ట్ గా బాలయ్యని టార్గెట్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. రామ్ చరణ్ లా కూల్ గా ఉండకుండా ఇలా పెద్దల వ్యవహారాల్లో తల దూరుస్తూ వివాదాలను పెద్దవి చేసేలా అతని వ్యవహార శైలి ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గొడవలు సర్దుమణిగేలా చూడాలే కానీ ఇలా వాటికి ఆజ్యం పోసేలా ఉండకూడదని వరుణ్ తేజ్ కి సోషల్ మీడియా వేదికగా సలహా ఇస్తున్నారు.