ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్ళాలి అంటే ఇది ఉండాల్సిందే..!

Dgp goutham sawang clarity about inter state traveling

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతరాష్ట్ర లకు పాసులు లేకుండా అనుమతి ఇచ్చినప్పటికీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పక్కా లాక్ డౌన్ ఆంక్షలు అమలు లోనే ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రదేశ్ కి అనుమతి ఇవ్వడం లేదు.
అయితే పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాక వారి చేతి పై స్వీయ నియంత్రణ లో ఉండేలా హోమ్ క్వారంటైన్ ముద్ర వేస్తున్నారు.
సరిహద్దుల వద్ద అడ్డుకోవడం తో గరికపాడు చెక్ పోస్ట్ వద్ద కీలో మెటర్ల దూరంలో వాహనాలు నిలిచి ఉన్నాయి.
అయితే రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రాల కి రావాలి అనుకొనే వారికి స్పందన పోర్టల్ ద్వారా ఖచ్చితంగా పాస్ తీసుకోవాలి అని డీజీపీ గౌతమ్ సవాంగు వివరించారు.
ఎవరు రాష్ట్రం లోకి వచ్చినా 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి. అయితే ఈ నిబంధనలు ఇలానే కొనసాగుతాయి అని వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంతర్ రాష్ట్ర వాహనాల రాకపోకల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
మరి దీనితో ప్రజలు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

Dgp goutham sawang clarity about inter state traveling

ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి ఇంకా వ్యాప్తి చెందుతున్న సమయంలో లాక్ డౌన్ సడలింపు చర్యల ద్వారా కరోనా వైరస్ మహమ్మారి మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది అని కొందరు బావిస్తున్నారు.
మరి ఈ అంశం పై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
error: Content is protected !!