ఏపీలో తెరుచుకోనున్న హోటళ్ళు, రెస్టారెంట్లు.. ఎప్పటినుంచో తెలుసా?

లాక్‌డౌన్ 5లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను, మార్గదర్శకాలను యథావిధిగా పాటించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే జూన్ 8 నుంచి రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది.

అయితే దీనిపై స్పందించిన ఏపీ పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఏపీలో హోటళ్ల పున: ప్రారంభంపై ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర హోటల్ సమాఖ్యతో చర్చిస్తామని, లాక్‌డౌన్ వల్ల హోటల్స్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.

అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, హోటళ్లు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని త్వరలోనే దీనిపై ఓ గైడ్ లైన్స్ విడుదల చేస్తామని అన్నారు.

error: Content is protected !!