Movies

పవన్ సినిమాను పక్కనబెట్టిన దిల్ రాజు…కారణం ఎవరో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాతో పవర్ స్టార్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

బాలీవుడ్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో వకీల్ సాబ్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

కాగా ఈ సినిమా షూటింగ్ మెజారిటీ శాతం ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.కాగా కొంతమేర మిగిలి ఉన్న సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

అన్ని సినిమాలకంటే ముందు ఈ సినిమానే షూటింగ్ ప్రారంభిస్తుందని అందరూ అనుకున్నారు.

కానీ ఈ సినిమాను ఇప్పట్లో ప్రారంభించాలని చూడట్లేదట చిత్ర నిర్మాత దిల్ రాజు.దీనికి బలమైన కారణం కూడా ఉందని ఆయన అంటున్నారు.

ప్రస్తుతం సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో, ఈ సినిమాను హడావిడిగా పూర్తి చేసినా ప్రయోజనం ఉండదని దిల్ రాజు భావిస్తు్న్నాడు.

ఇక ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తుండగా నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.