Movies

అవసరాల శ్రీనివాస్ పెళ్లి చేసుకోకపోవటానికి అసలు కారణం ఇదేనట

అవసరాల శ్రీనివాస్ గురించి తెలియని మూవీ లవర్ ఉండరు. నటుడిగా, దర్శకుడిగా, సంభాషణల రచయితగా ఇలా బహుముఖప్రజ్ఞ కలిగిన ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అష్టా చెమ్మాలో నానితో పోటీగా నటించి మెప్పు పొందిన శ్రీనివాస్ ఆ తర్వాత గోల్కొండ హై స్కూల్, పిల్ల జమిందార్ లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్నారు. ఊహలు గుసగుసలాడేతో దర్శకుడిగానూ ప్రూవ్ చేసుకున్నారు. రాశి ఖన్నాతో పాటు నాగ శౌర్యకు బ్రేక్ ఇచ్చి తనలో డైరెక్టర్ కు గోల్డెన్ నందితో పాటు సైమా పురస్కారం కూడా దక్కించుకున్నారు.

ఆ తర్వాత నారా రోహిత్, నాగ శౌర్యలతో తీసిన జో అచ్యుతానంద కూడా విమర్శకుల మెప్పు పొందింది. డైలాగ్ రైటర్ గా దీనికీ బంగారు నంది పురస్కారం దక్కింది. ఇప్పటికీ యాక్టర్ గా బిజీగా ఉన్న అవసరాల శ్రీనివాస్ త్వరలో విడుదల కాబోతున్న నాని విలో కూడా ఒక కీలక పాత్ర దక్కించుకున్నారు. అయితే ఎక్కువ శాతం ప్రేక్షకులకు తెలియని ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే అవసరాలకు ఇంకా వివాహం కాలేదు. ఆర్థికంగా బలంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళు పోరు పెడుతున్నా ఆలస్యం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడైతే ఆలోచన ఉందంటున్నారు కానీ ఎప్పుడనేది మాత్రం చెప్పడం లేదు.

ఒకప్పుడు తీవ్రమైన ఆస్త్మా వ్యాధితో బాధ పడిన శ్రీనివాస్ దాని వల్లే ఒక స్టేజిలో రోజుకు కేవలం రెండు మూడు గంటలే నిద్రపోయేవారు. ప్రాణిక్ హీలింగ్ ద్వారా 95 శాతం రికవరీ అయిన శ్రీనివాస్ కు ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. డబ్బు ఇబ్బందుల వల్ల కెరీర్ పూర్తిగా సెటిల్ కాకపోవడం వల్ల మూడు మూళ్ళకు దూరంగా ఉన్న అవసరాలకు త్వరలో ఆ అవసరం రావాలని కోరుతున్నారు ఫ్యాన్స్. ఆధ్యాత్మిక చింతన కూడా ఉన్న అవసరాల శ్రీనివాస్ ఆ దిశగా రీసెర్చ్ చేసి పలుగురు గురువులతో దీనికి సంబంధించిన విద్యను నేర్చుకుని అద్భుత ఫలితాలను సాధించారు. మొత్తానికి తనలో ఉన్న డిఫరెంట్ షేడ్స్ ని పరిచయం చేస్తున్న అవసరాల శ్రీనివాస్ లో చాలా కోణాలే ఉన్నాయన్న మాట. ఇవన్ని ఓ ఇంటర్వ్యూ సందర్భంలో ఆయనే స్వయంగా షేర్ చేసుకోవడం విశేషం.