మెగా హీరోకి ‘సోలో బ్రతుకే సో బెటర్’…. ట్రాక్ లో పడినట్టేనా…?
హిట్స్ లేక ఇబ్బంది పడుతూ, ‘చిత్రలహరి’ సినిమాతో హిట్ కొట్టిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతి రోజూ పండగే’ కూడా కమర్షియల్ గా మంచి హిట్ సొంతం చేసుకున్నాడు. ఈ రెండు సినిమాలతో మళ్ళీ ఇండస్ట్రీలో పట్టాలెక్కాడు. ఈ ఊపుతోనే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం లాక్ డౌన్ వలన షూటింగ్స్ ఆగిపోవడంతో యితడు ఖాళీగానే ఉన్నాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీతో పాటు దేవా కట్ట దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కూడా యితడు చేస్తున్నాడు.
ఇందులో ఇప్పటికే ‘సోలో బ్రతుకే సో బెటర్’ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని లాక్ డౌన్ వలన రిలీజ్ఆగింది . త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతోన్న ఈ సినిమా లోని నో పెళ్ళి అన్న సాంగ్ ఈ మధ్యనే రిలీజ్ చేశారు. సాంగ్ లో సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ నభా నటేష్ లతో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రానా దగ్గుబాటి కూడా కనిపించి సందడి చేశారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్ఠిస్తోంది. ఒక్క మెగా ఫ్యాన్స్ నుంచే కాదు ప్రేక్షకులందరి నుంచి విపరీతమైన రెస్పాన్స్ అందుకుంది.
అయితే సాయి ధరమ్ తేజ్ దేవ కట్టా సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవంగా ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు. అయితే దేవ కట్టా కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క భారీ సక్సస్ కూడా లేకపోవడంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే పెద్దగా పాజిటివ్ బజ్ రాకపోవడంతో దేవ కట్టా తో సినిమా మొదలు పెట్టాలంటే సాయి ధరమ్ తేజ్ పునరాలోచన చేస్తున్నట్లు టాక్. ఇందుకు కారణం ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫలితం చూసిన తర్వాతే, తదుపరి మూవీ మొదలుపెట్టాలని భావిస్తున్నాడట. ఈవిషయాన్ని దేవ కట్టాకు తేజు ఎలాంటి జంకు లేకుండా చెప్పేశాడట. మరి తేజు ఫ్యూచర్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫలితం మీద ఆధార పడిఉందని అంటున్నారు.