చైతు కోసం ఆన్ లైన్ లో సమంత కొత్త పాఠాలుఏమిటో తెలుసా?

అక్కినేని కోడలు సమంత ఈ లాక్ డౌన్ సమయంలో తన భర్తకోసం కొత్త పాఠాలు వల్లెవేస్తోందట. నాగ చైతన్య కోసం ఆన్‌లైన్‌లో నేర్చుకుంటున్న ఈ పాఠాలు ఏమిటా అని చర్చ నడుస్తోంది. పెళ్ళికి ముందే కాదు, పెళ్లి తర్వాత కూడా సమంత వరస హిట్లతో దూసుకుపోతుంది. రెమ్యునరేషన్ కూడా భారీగానే పెంచేసిందని టాక్ నడుస్తోంది. ఈలోగా కరోనా లాక్‌డౌన్ విధించడంతో అందరిలాగే ఇంటికే పరిమితమైంది. అంతేకాదు తనకు సంబంధించిన విశేషాలను అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటూ సందడి చేస్తోంది.

ఇక షూటింగ్స్ లేకపోవడంతో ఇంట్లో ఎక్కువ సేపు గడవకపోవడంతో సమంత.. ఇంట్లో ఉన్న టెర్రస్ పై ఇంటికి కావాల్సిన కూరగాయలను కూడా లాక్ డౌన్ వేళ పండిస్తోంది. అది కూడా పూర్తిగా సేంద్రియా పద్దతులతో పండిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటోంది. ఇప్పటికే భర్తతో షికారుకు వెళ్లిన ఫోటోలను అభిమానులతో పంచుకున్న సమంత.. రీసెంట్‌గా తన పదో తరగతి పరీక్షలకు సంబంధించిన మార్క్స్ లిస్ట్ కూడా అభిమానులతో పంచుకుంది.

ఇక సమంతకు వంట మాత్రం రాదు. వీళ్ల ఇంట్లోకూడా నాగ చైతన్యనే సమంత కోసం గరిట తిప్పుతున్నాడు.ఇప్పటికే చైతూ చేసి వివిధ వంటలను సమంత సోషల్ మీడియాలో అభిమానులకు చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ఆన్‌లైన్‌లో వంట క్లాస్ లకు సమంత హాజరైంది. అంతేకాదు కేవలం కొన్ని రోజుల్లోనే వంటలో ఎన్నో మెళకువలు నేర్చుకుని, ఇపుడు ఏకంగా తన భర్త నాగచైతన్యకు వంట చేసి పెడుతోంది. అంతేకాదు,ఇంట్లో భర్త నాగ చైతన్యతోపాటు..కుక్కతో ఆడుకుంటోంది.