తమన్నాకి కోపం వచ్చిందంట…ఎందుకు అంటే…?
తమన్నా తన 15 ఏళ్ల కెరీర్ లో ఎన్ని రకాలుగా రూమర్స్ వచ్చిన ఎప్పుడు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అయితే ఈ సారి మాత్రం తమన్నాకు చాలాకోపం వచ్చేసింది. దానికి కారణం ఏమిటని తమన్నాని అడిగితె ఈ మధ్య డేటింగ్ వార్తలు ఎక్కువవ్వడం వలనే అని క్లారిటీ ఇచ్చింది. గతంలో పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో తమన్నా దర్శనమివ్వడంతో అతనితో డేటింగ్ చేస్తుంది అని ప్రచారం జరిగింది.
అయితే అది కేవలం ఓ షాప్ ఓపెనింగ్ ప్రమోషన్స్ కోసమే అని వివరణ ఇచ్చింది. అతనితో డేటింగ్ ఏంటి? చిరాకొచ్చేస్తుంది ఇలాంటి వార్తలు వింటుంటే..! అదంతా ట్రాష్ అని కొట్టిపారేసిన తమన్నా.. ఇటీవల కోలీవుడ్ లో వస్తున్న రూమర్స్ తో విసిగిపోతుందట. అందుకే ఓ రేంజ్ లో ఫెయిర్ అయింది.