Movies

“ఈ రోజుల్లో” సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు

మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించి విమర్శకుల నోట ప్రశంసలు అందుకుంది. మారుతి మొదటి సినిమా ఈరోజుల్లో. శ్రీ, రేష్మ జంటగా నటించిన ఈ సినిమా 2012లో రిలీజై ఓ ట్రెండ్ సృష్టించింది.అదేంటీ ట్రెండ్ సృష్టించాలంటే స్టార్స్ కావాలి.. భారీ బడ్జెట్ కావాలి కదా అనుకోవచ్చు. ఇవేమి లేకుండానే ఇలా కూడా సినిమా తీయొచ్చు అని ప్రూవ్ చేసి చూపించాడు మారుతి.

గుడ్ ఫ్రెండ్స్ బ్యానర్ లో ఈరోజుల్లో సినిమా చేసిన మారుతి ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ 50 లక్షల లోపే.. అయితే సినిమా తీయడం కాదు దాన్ని ఎలా ప్రమోట్ చేయాలో కూడా తెలిసిన మారుతి ఈరోజుల్లో సినిమాను బాగా ప్రమోట్ చేశాడు. దాంతో లాభాలు కూడా బాగా వచ్చాయి.