విరాటపర్వం సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

బాహుబలితో నెగెటివ్ రోల్ లో సైతం సూపర్ గా మెప్పించిన యంగ్ హీరో రానా దగ్గుబాటి త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. ఇక లేటెస్ట్ మూవీ విరాటపర్వం చేస్తున్నాడు. శరవేగంగా సాగిన షూటింగ్ లాక్ డౌన్ తో బ్రేక్ తీసుకుంది. ఇక ఈ సినిమా 1990లోని నక్సలైట్ల జీవితాధారంగా తెరకెక్కుతుండగా, రానా సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోండగా, ఆమె ఫస్ట్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇందులో నందితా దాస్, ప్రియమణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ మూవీలో రానా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు భారీగానే వచ్చాయి. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. వేగంగా వైరల్ కూడా అవుతోంది. అదేమిటంటే, నిజానికి ఈ సినిమా లో హీరోగా తొలుత మ్యాచో స్టార్ గోపీచంద్‌ను డైరెక్టర్ సంప్రదించినట్లు టాక్.

అయితే ఆ సమయంలో గోపీచంద్ వరుసగా సినిమాలు చేస్తుండటంతో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో విరాటపర్వం చిత్రాన్ని రిజెక్ట్ చేశాడట. ఇక ఎంతమాత్రం లేట్ చేయకుండా వేణు ఉడుగుల సురేష్ ప్రొడక్షన్స్‌కు సంప్రదించగా, రానా హీరోగా ఒకే చేయడంతో సినిమా స్టార్ట్ చేసేసారు.మొత్తానికి వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న గోపీచంద్ ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా చేసుంటే బాగుండేది అని పలువురు అంటున్నారు. అయితే గోపీచంద్ ఈ సినిమా చేస్తే, ఇప్పుడున్న క్రేజ్ ఉండకపోయేదని కూడా మరికొందరు అనేమాట. చూద్దాం ఈ సినిమా ఎలాంటి సెన్షేషన్ క్రియేట్ చేస్తుందో.