జూన్ 21,2020 సూర్యగ్రహణం పట్టు,విడుపు సమయాలు
2020 జూన్ 21వ తేదీన జేష్ఠ బహుళ అమావాస్య ఆదివారం రోజు రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణము మృగశిర నక్షత్రం సింహ లగ్నంలో ఏర్పడబోతోంది. గ్రహణం సమయంలో స్నానము, జపము, తపము, దానము లాంటివి ఆచరిస్తే విశేషమైన ఫలితాలను పొందుతారు.
అలాగే గ్రహణం సమయంలో భోజనం చేయడం మంచిది కాదు. గ్రహణం అనంతరం శాంతి చేసుకుంటే చెడు ప్రభావం నుండి బయటపడతారు. సూర్యుడిని ప్రత్యక్షంగా చూడకూడదు. కంటికి మంచిది కాదు. మృగశిర, ఆరుద్ర నక్షత్రాలలో ఈ గ్రహణం సంభవిస్తుంది. కాబట్టి మిధున రాశి మరియు ధనస్సు రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. పట్టువిడుపు సమయాల విషయానికి వస్తే స్పర్శ కాలం ఉదయం 10 గంటల 20 నిమిషాలకు, గ్రహణ మధ్య కాలం మధ్యాహ్నం 12:08 నిమిషాలకు, గ్రహణ మోక్ష కాలం మధ్యాహ్నం 01:54 నిముషాలుగా ఉన్నాయి అలాగే 03:29 నిమిషాలకు గ్రహణం పూర్తిగా విడుస్తుంది ఈ గ్రహణం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.
కొన్ని ప్రాంతాల్లో కన్య లగ్నం నందు ఈ గ్రహణం పట్టడం వలన రోహిణి, మృగశిర, ఆరుద్ర మరియు పునర్వసు నక్షత్రం వారు అలాగే వృషభ, మిథున, కర్కాటక, మరియు వృశ్చిక రాశుల వారు శాంతి చేయించుకోవటం మంచిది మేష ,సింహ, కన్య మరియు మకర రాశుల వారు ఈ గ్రహణం మూలంగా ఉత్తమ ఫలితాలను పొందుతారు.