Movies

కీర్తి సురేష్ పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటికి పరిమితం కావడంతో సెలబ్రిటీలు కూడా ఇళ్లల్లోనే గడుపుతున్నారు. అయితే ఇప్పుడిపుడే మళ్ళీ షూటింగ్స్ కోసం రెడీ అవుతున్నారు. సడలింపు కారణంగా రేపో మాపో షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వరస సినిమాలతో బిజీగా ఉంది. అందులో కొన్ని పూర్తైపోయాయి. అయితే లాక్‌డౌన్ కారణంగా విడుదలకు నోచుకోవడం లేదు. కానీ ఓటిటి ప్లాట్ ఫామ్‌లోనే కీర్తి సురేష్ సినిమాలు విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమాలు చేసినా చేయకపోయినా సరే, ఈ తరం ప్రేక్షకులు సావిత్రిలాగే ఈ ముద్దుగుమ్మను గుర్తు పెట్టుకుంటారు. ఇందుకు కారణం ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిల్చిపోవడమే. ఈ సినిమా తో ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది.

మహానటి తర్వాత పెద్దగా సినిమాలు ఆడకపోయినా మళ్ళీ ఫామ్ లోకి కీర్తి వచ్చేసింది. తమిళ, హిందీ సినిమాలతో కూడా బిజీగా మారిపోయింది. అందులో భాగంగా కార్తిక్ దర్శకత్వంలో కీర్తి నటించిన పెంగ్విన్ సినిమా ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో జూన్ 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో దర్శక నిర్మాతలు విడుదల చేయబోతున్నారు. అలాగే తెలుగులో నితిన్ రంగ్ దే సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా చేస్తోంది. సినిమాకు దాదాపు కోటి నుంచి కోటిన్నర వరకు పారితోషికం కీర్తి ఛార్జి చేస్తోందట.

కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమా అయితే కీర్తి సురేష్ కోటిన్నర వరకు తీసుకుంటుందని, హీరోయిన్ పాత్ర అయితే కోటి తీసుకుంటుందని టాక్. పైగా ఇప్పుడ ఈమె సినిమాలను నిర్మాతలు నేరుగా ఓటిటిలో విడుదల చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు .పెంగ్విన్‌తో పాటు మరికొన్ని రోజులు చూసి మిస్ ఇండియా సినిమా సైతం ఓటిటిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే జ్యోతిక, అమితాబ్‌, ఆయుష్మాన్ ఖురానా లాంటి స్టార్స్ నటించిన సినిమాలను నేరుగా అమోజాన్‌ ప్రైమ్‌లో విడుదలయ్యాయి. మిగిలిన హీరోయిన్స్ కి ఆదర్శంగా ఓ టి టి లో కీర్తి నిలవబోతోందా?