Movies

జీవితం,సినీ కెరీర్ విషయంల గురించి ఆశ్చర్యపోయే వాస్తవాలు

క్రికెటర్ ధోని బయోపిక్ తో బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన సుశాంత్ రాజపుత్ ఆత్మహత్య చేసుకోవడం యావత్ భారతాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. స్వయంశక్తితో ఎదిగిన సుశాంత్ మరణం చూసినపుడు టాలీవుడ్ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గుర్తొస్తుంది. వీరిద్దరిలో కామన్ పాయింట్స్ చాలా కనిపిస్తున్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాలు చేయలేమేమో ,ఛాన్స్ లు రావేమో అనే భ్రాంతిలో ఇద్దరూ కూడా ఆదివారమే సూసైడ్ చేసుకోవడం యాదృచ్ఛికమే.

టివి సీరియల్స్ లో నటిస్తూ బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సుశాంత్ ఎక్కువ సమయంలోనే ఎక్కువ పేరు తెచ్చేకున్నాడు. ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన సుశాంత్ అర్ధాంతరంగా ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. ఆత్మహత్యకు పురికొల్పే ఎలాంటి సంఘటనలు జరిగాయో గానీ మంచి భవిష్యత్తుగల నటుడు మాత్రం తెరమరుగయ్యాడు. ఇటు ఉదయ్ గానీ, అటు సుశాంత్ గానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో పైకి వచ్చారు. ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ అయినవాళ్లే. ఇద్దరి మొదటి మూడు మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి.

వీరిద్దరి కెరీర్ తక్కువ సమయంలోనే ముగిసి,34ఏళ్ళ ప్రాయంలోనే అంతమయ్యారు. వీరిద్దరి గురించి ఆలోచిస్తే హృదయ విదారకంగా ఉంటుంది. వీరిద్దరికి తల్లులంటే చాలా ఇష్టం. సుశాంత్ డిగ్రీ స్టడీ సమయంలో అతని తల్లి చనిపోగా, ఉదయ్ తల్లి తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పోయారు. వీరిద్దరికీ తల్లుల మరణం డిప్రెషన్ కి గురిచేసింది.