Movies

స్టార్ట్ కాని పవన్ – క్రిష్ సినిమా కి అప్పుడే ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో…?

ఏది ఏమైనా కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచ గతినే మార్చేసింది. కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. ఇక సినిమా రంగం అయితే ఇప్పట్లో కోలుకునేలా లేదు. ఇప్పటికే కోట్లాది రూపాయల నష్టం అని వింటున్నాం. ఇక జనసేన పార్టీ నడుపుతూ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ముందుగా పింక్ హిందీ మూవీకి రీమేక్ గా వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసుకొని క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాకి రెడీ కావాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి వచ్చి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ మొత్తం డిస్టర్బ్ చేసింది.

సినిమా షూటింగ్ లు అన్ని కూడా ఆగిపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి.ఇక క్రిష్ సినిమా కోసం ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో కోటిన్నర పెట్టి ఓ భారీ సెట్ వేశారు. అయితే షూటింగ్ ఆగిపోవడంతో పాటు, గత కొంత కాలంగా విపరీతమైన వర్షాలు పడటంతో ఈ సెట్ మొత్తం పాడైపోయింది. సినిమాలోని కీలక సన్నివేశాలు ఆ సెట్ లో జరగాల్సి ఉన్నాయని తెలుస్తుంది. సముద్రం ఇంకా భారీ ఓడ సెట్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో వేయించారు. భారీ వర్షాల కారణంగా ఏకంగా కోటి రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది.

ఇక దాదాపు మూడు నెలల విరామం తర్వాత వకీల్ సాబ్ చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. పవన్ కళ్యాణ్ ఒకటి రెండు రోజుల్లో వకీల్ సాబ్ చిత్రీకరణలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. నెల రోజుల వకీల్ సాబ్ షెడ్యూల్ పూర్తి చేసి క్రిష్ సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొనాల్సి ఉంది. ఆగస్టు నుండి క్రిష్ మూవీ స్టార్ట్ చేయాల్సి ఉంది. అయితే ఇంతలో ఆ సెట్ నాశనం కావడంతో మళ్ళీ దానిని రీసెట్ చేయాల్సిన అవసరం వచ్చింది. దీంతో మూవీ షూటింగ్ మళ్ళీ ఆలస్యం అవుతుందని చెప్పాల్సిన అవసరం లేదు.