ప్రభాస్ కొత్త సినిమా హాస్పిటల్ సెట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో…?
ప్రభాస్ 20 వ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో 5 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన హాస్పిటల్ సెట్ ను నిర్మిస్తున్నారట. హాస్పిటల్ సెట్ ను నాలుగు అంతస్తులుగా నిర్మిస్తున్నారు.
దీనిలో ఐసియు వార్డ్, ప్రత్యేక వార్డ్, జనరల్ వార్డులు మరియు డాక్టర్ రూమ్స్ ఉన్నాయట. ఈ సెట్ లో దాదాపుగా నెల రోజుల పాటు షూటింగ్ చేయనున్నారట. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకి ‘రాధే శ్యామ్’ అని టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారు. ఇంకా టైటిల్ ని ఫైనల్ చేయలేదు. పూజ హెడ్గే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు గెటప్స్ లో కనిపిస్తారట.